: చిత్తూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్ సిద్ధార్థ్ జైన్


భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ సూచించారు. పీఆర్ కండ్రిగ, నేచనూరు వద్ద నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి విపత్తు సంభవించినా సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. అలాగే సహాయక చర్యల కోసం రేణిగుంట విమానాశ్రయంలో హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచామన్నారు. ఇక జిల్లాలోని నాగులాపురం, విజయపురం, తొట్టంబేడు మండలాల్లో కొన్ని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని కలెక్టర్ చెప్పారు.

  • Loading...

More Telugu News