: మోదీపై లాలూ తనయుడి సెటైర్లు!
బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ జోరు పెంచారు. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ లాగే సెటైరికల్ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం ఆయన ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాతావరణ సదస్సు నిమిత్తం ఫ్రాన్స్ వెళ్లిన మోదీ రెండు రోజుల పర్యటన అనంతరం నేటి ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. మోదీ ఢిల్లీలో అడుగుపెట్టిన మరుక్షణం పాట్నాలో ఉన్న తేజస్వీ మీడియా ముందుకు వచ్చారు. బట్టలు ఉతికించుకోవడానికే మోదీ ఇండియా వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అయినా మోదీ విదేశీ పర్యటనల్లో పెద్దగా ఎజెండా ఏమీ ఉండదన్న కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధి గురించి యోచించే తీరిక కూడా మోదీకి లేదని తేజస్వీ విరుచుకుపడ్డారు.