: అన్నవరం ఆలయ ముఖద్వారానికి బంగారు తాపడం


తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ ముఖద్వారానికి బంగారు తాపడం ఏర్పాటు చేశారు. ప్రధాన ముఖద్వారం గోడలకు చేయించిన బంగారు తాపడాన్ని ఈ ఉదయం ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. పెద్దాపురానికి చెందిన దాతలు శ్రీనివాస్, సత్యప్రసాద్ సహకారంతో ఆలయ ముఖ ద్వారానికి అత్యంత సుందరంగా బంగారు తాపడాన్ని చేయించారు. దాంతో ఆలయ ద్వారం వెలుగులీనుతూ భక్తులను ఆకర్షిస్తోంది.

  • Loading...

More Telugu News