: ఒకే టెస్టులో 12 వికెట్లు... టెస్టుల్లో రెండో ర్యాంకులో అశ్విన్!
ఫ్రీడమ్ సిరీస్ లో సత్తా చాటుతున్న చెన్నై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు కెరీర్ బెస్ట్ ర్యాంకు దక్కింది. నిన్న వెలువడిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో బౌలింగ్ విభాగంలో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. అశ్విన్ కెరీర్ లో ఇప్పటిదాకా అతడికి ఇదే బెస్ట్ ర్యాంకు. ఫ్రీడమ్ సిరీస్ కు ముందు ఐదో ర్యాంకులో ఉన్న అశ్విన్, మూడో టెస్టులో ఏకంగా 12 వికెట్లు నేలకూల్చి ఏకంగా ఒకేసారి మూడు స్థానాలు పైకి ఎగబాకాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 856 రేటింగ్ పాయింట్లున్నాయి. ఇక ఈ విభాగంలో దక్షిణాఫ్రికా స్పీడ్ స్టర్ డేల్ స్టెయిన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.