: ప్రజాగాయకుడి కేసులో జయ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ


దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జయలలిత ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వామపక్ష ప్రజాగాయకుడు కోవన్ ను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలన్న తమిళనాడు సర్కార్ విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు వివరాల్లోకి వెళ్తే, అతివాద వామపక్ష సాంస్కృతిక సంస్థ 'మక్కల కలై ఇలక్కియ కజగం' తరపున 54 ఏళ్ల కోవన్ పాటలు పాడుతుంటారు. అయితే, ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఆన్ లైన్ లో వీడియోలను అప్ లోడ్ చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలతో... అక్టోబర్ 30న దేశద్రోహం ఆరోపణలతో ఆయనను తమిళనాడు ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో, కోవన్ కు విధించిన పోలీస్ కస్టడీపై హైకోర్టు స్టే విధించింది. దీంతో, జయ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ కలిఫుల్లా, జస్టిస్ లలిత్ ల ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ ను తిరస్కరించింది. తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనకు ఎలాంటి యోగ్యత లేదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News