: జేపీసీ ఎదుట హాజరుకావాలని ప్రధానిపై బీజేపీ ఒత్తిడి


2జీ స్పెక్ట్రమ్ స్కాం వ్యవహారంలో జేపీసీ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ) ఎదుట ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హాజరుకావాలంటూ వస్తున్న ఒత్తిడి మరింత తీవ్రమైంది. కమిటీ ఎదుట హాజరుకావాల్సిందేనని బీజేపీ నేత యశ్వంత్ సిన్హా మరోసారి సూటిగా డిమాండు చేశారు. మౌనంగా ఉన్నందువల్ల 2జీ విషయంలో ప్రధాని పాత్ర కూడా ఉందని 'నిర్ధారణ' చేసుకోవల్సి ఉంటుందని పేర్కొన్నారు.

'సంయుక్త పార్లమెంటరీ కమిటీ' ఎదుట హాజరుకావాలని గతనెలలో సిన్హా ప్రధానికి లేఖరాశారు. ఆ లేఖను, అందులోని అంశాలను మన్మోహన్ తోసిపుచ్చారు. ఈ అంశంపై పూర్తి నిర్ణయం కమిటీయే తీసుకుంటుందన్నారు. అటు, ప్రధానిని సంప్రదించాకే 2జీ లైసెన్సుల కేటాయింపుల వ్యవహారంలో అన్ని పనులు చేసినట్లు మాజీమంత్రి ఏ.రాజా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యశ్వంత్ నిన్న మళ్లీ ప్రధానికి లేఖ రాశారు.

  • Loading...

More Telugu News