: జమ్మూకాశ్మీర్ టెన్త్ పరీక్షా పేపర్ లో జవాబు లేని ప్రశ్న!
మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల్లో జవాబు లేనటువంటి ఒక ప్రశ్నను ఇచ్చిన సంఘటన జమ్మూకాశ్మీర్ లో జరిగింది. జమ్మూకాశ్మీర్ లో పదో తరగతి విద్యార్థులకు ఇటీవల బోర్డ్ పరీక్షలు జరిగాయి. ఒక పరీక్ష ప్రశ్నాపత్రంలో ఒక మల్టిపుల్ ప్రశ్న..‘గత మార్చిలో పీడీపీ ప్రభుత్వంతో పొత్తు కుదుర్చుకున్న పార్టీ ఏదీ?’. దీనికి మల్టిపుల్ సమాధానాలుగా... కాంగ్రెస్, సీపీఐ(ఎం), మరో రెండు ప్రాంతీయ పార్టీల పేర్లు ఉన్నాయి. కానీ, పొత్తు కుదుర్చుకున్న బీజేపీ పేరు మాత్రం అందులో లేదు. దీంతో విద్యార్థులకు ఏమి చెయ్యాలో తోచలేదు. కాగా, ఈ విషయమై విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. దీంతో, అధికారులు విచారణ చేపట్టారు.