: కాపు కమిషన్ ఏర్పాటుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జితో అధ్యయనం: ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం
కాపులను బీసీల్లో చేర్చే విషయమై ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కాపు కమిషన్ ఏర్పాటు చేయడం కోసం హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేత అధ్యయనం చేయించాలని ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు, కోస్తా తీర ప్రాంత అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. అయితే, పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుపై నిర్ణయాన్ని మాత్రం వాయిదా వేశారు. కేబినెట్ సమావేశం మూడు గంటలకు పైగా కొనసాగింది.