: మకావు టైటిల్ గెలిచిన సింధుకు రూ.10 లక్షల నజరానా


మకావు ఓపెన్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) నజరానా ప్రకటించింది. రూ.10 లక్షల నగదు నజరానా ఇవ్వనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ శ్రేణిలో మరోసారి సింధు తన ప్రతిభను చాటిందని బ్యాడ్మింటన్ సంఘం ఈ మేరకు పేర్కొంది. టోర్నీకి వెళ్లేముందే ఆమెపై తమకు నమ్మకం ఉందని, అనుకున్నట్టుగానే టైటిల్ ను సొంతం చేసుకుందని 'బాయ్' ప్రెసిడెంట్ అఖిలేష్ దాస్ గుప్తా అన్నారు.

  • Loading...

More Telugu News