: విజయవాడలో డీజీపీ కొత్త క్యాంపు కార్యాలయం ప్రారంభం


విజయవాడలో ఏపీ డీజీపీ కొత్త క్యాంపు కార్యాలయాన్ని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు ఈ రోజు ప్రారంభించారు. సీఎం విడిది కార్యాలయానికి సమీపంలోనే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు ఈ కార్యాలయానికి ఆనుకుని ఉన్న డీజీపీ అధికారిక నివాసం రెండు నెలల కిందటే ఆరంభమైంది. ఆఫీసర్స్ క్లబ్ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చారు. విజయవాడ కేంద్రంగా కొన్ని నెలల నుంచి సీఎం చంద్రబాబు పరిపాలన చేస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయం అక్కడికి తరలివస్తోంది.

  • Loading...

More Telugu News