: పోలీసుల అదుపులో నకిలీ వైద్యులు!


హైదరాబాదులో నకిలీ పచ్చళ్లు, మసాలా పౌడర్లు మొదలైన ఉత్పత్తులు చేసే వారి సంఖ్య ఎక్కువైంది. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నకిలీ వైద్యుల ఉదంతం వెలుగు చూసింది. హైదరాబాద్ లోని పాతబస్తీలో నకిలీ వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్హత, సరైన పత్రాలు లేకుండా పాతబస్తీలో వైద్యం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించడంతో వారిని అరెస్టు చేశారు. నకిలీ వైద్యులు నిర్వహిస్తున్న క్లినిక్ లను జప్తు చేశామని, 111 మంది నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకున్నామని దక్షిణ మండల పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News