: తిరుమలలో 3 గంటలు, యాదాద్రిలో 5 గంటలు!
ఈ ఉదయం తిరుమలను మించిన రద్దీ యాదగిరిగుట్టలో కనిపించింది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, యాదాద్రిలో లక్ష్మీ నరసింహుడిని చూడాలంటే 5 గంటల సమయం పడుతోంది. ఇక తిరుమలలో ప్రత్యేక దర్శనం 2 గంటల్లోపే పూర్తవుతున్న వేళ, యాదాద్రిలో 2 గంటలకు మించిన సమయం పడుతోంది. రద్దీ అత్యధికంగా ఉన్నందున గుట్టపైకి ఎటువంటి వాహనాలనూ వెళ్లనీయకుండా అధికారులు కిందనే నిలిపివేశారు. దీంతో మెట్ల మార్గం సైతం కిటకిటలాడుతోంది. కాగా, ఈ ఉదయం తిరుమల వెంకన్నను సీబీఐ డైరెక్టర్ అనిల్ సిన్హా దర్శించుకున్నారు. అనిల్ సిన్హాకు ఆలయ అధికారులు ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.