: రూ. 335కే చిట్టి కంప్యూటర్... కొందామంటే స్టాక్స్ నిల్!


ట్యాబ్ ల రూపంలో చేతుల్లో ఇమిడిపోయే కంప్యూటర్లు ఎన్నడో వచ్చేశాయి. ఇక మరింత చిన్న కంప్యూటర్... అంటే జేబులో మరింత సులువుగా ఇమిడిపోయేంత సైజులో రాస్ప్ బెర్రీ పీఐ ఫౌండేషన్ అనే సంస్థ ఓ చిన్న కంప్యూటర్ ను తయారు చేసింది. ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా తయారైన దీని పేరు పీఐ జీరో. దీని ధర 5 డాలర్లు (సుమారుగా రూ. 335). 1 గీహెచ్ ప్రాసెసర్ తో పాటు 512 ఎంబీ రామ్, రెండు యూఎస్బీ స్లాట్లు, మెమొరీ కార్డ్ సౌకర్యం, మినీ హెచ్డీఎంఐ సాకెట్ తదితరాలతో వచ్చిన దీన్ని మార్కెట్లోకి విడుదల చేసిన గంటల్లోనే స్టాక్ మొత్తం అయిపోయింది. ఇక ఇదే ఫౌండేషన్ ప్రచురిస్తున్న 'ది మ్యాగ్ పీఐ' అనే పత్రికకు చందా కడితే, ఈ బుల్లి కంప్యూటర్ ను ఇస్తారట!

  • Loading...

More Telugu News