: సైబరాబాద్ కమిషనరేట్ లో సస్పెండ్ అయిన ఎస్సై ఆత్మహత్యాయత్నం


సైబరాబాద్ కమిషనరేట్ లో ఎస్సై ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. రేషన్ దుకాణాలు, వినాయక చవితి మండపాల యజమానుల నుంచి వసూళ్లు చేసి అవినీతికి పాల్పడ్డాడంటూ వనస్థలిపురం ఎస్సై సైదులును సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అవినీతి ఆరోపణలపై కమిషనర్ కు వివరణ ఇచ్చేందుకు ఎస్సై సైదులు కమిషనరేట్ కు వెళ్లారు. అక్కడ ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిని గుర్తించిన పోలీసులు ఆయనను గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News