: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సూర్య
సినీ నటుడు సూర్య మరోసారి గొప్పమనసు చాటుకున్నాడు. ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అభిమానుల మనసులు చూరగొన్న సూర్య, తమిళనాడు వరద బాధితుల సహాయార్థం 25 లక్షల రూపాయల విరాళాన్ని నడిగర సంఘానికి ఇచ్చాడు. సంఘం అధ్యక్షుడు నాజర్ కు ఈ మేరకు చెక్కు అందజేశాడు. మరో సినీ నటుడు ధనుష్ వరద బాధితులను ఆదుకునేందుకు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. వరదలతో అతలాకుతలమైన ప్రజలను ఆదుకునేందుకు తన వంతు సాయంగా ఈ మొత్తం అందజేస్తున్నట్టు సూర్య తెలిపాడు. కాగా, గతంలో విశాఖపట్టణాన్ని హుదూద్ తుపాను బీభత్సం సృష్టించిన సందర్భంగా సూర్య 25 లక్షల రూపాయలు విరాళం అందజేసిన సంగతి తెలిసిందే.