: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త... త్వరలో 12 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ!
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో త్వరలో 12 వేల పోస్టుల భర్తీ జరగనుందని ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసు శాఖను నిధుల కొరత వేధిస్తోందని కేంద్రానికి నివేదికలు పంపామని అన్నారు. త్వరలో తొలి విడతగా 6 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని, ఆ తరువాత మిగిలిన ఆరు వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. పోలీసు వ్యవస్థను ఆధునికీకరిస్తామని ఆయన తెలిపారు. సమర్థవంతంగా పనిచేసిన పోలీసులను నగదు బహుమతులతో సత్కరిస్తామని ఆయన వెల్లడించారు.