: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న మహేశ్ బాబు, రానాల వీడియో


ప్రిన్స్ మహేశ్ బాబుకు మరో నటుడు రానా పాదాభివందనం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే, తాజాగా సుధీర్ బాబు హీరోగా నటించిన 'భలే మంచి రోజు' సినిమా ఆడియో వేడుక హైదరాబాదులో జరిగింది. ఈ వేడుకకు హాజరైన సందర్భంగా రానా ఆడిటోరియంలోకి వస్తూనే మహేశ్ బాబు దగ్గరకు వచ్చాడు. ఈ సందర్భంగా రానాను పలకరించేందుకు మహేశ్ సీట్లోంచి లేచేందుకు ప్రయత్నించగా, రానా వంగి మహేశ్ కాళ్లకు నమస్కారం చేశాడు. దీంతో మహేశ్ బాబు అవాక్కైనా నవ్వేశాడు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియోను రానా, మహేశ్ బాబు అభిమానులు బాగా షేర్ చేసుకుంటున్నారు. దాంతో ఇప్పుడిది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News