: మ్యాగీ పాస్తాపై వస్తున్న వార్తలను ఖండించిన నెస్లే


మ్యాగీ పాస్తాలో హానికారక సీసం శాతం ఎక్కువగా ఉందని వెల్లువెత్తుతున్న వార్తలను నెస్లే సంస్థ ఖండించింది. నాణ్యమైన ముడి సరుకును ఉపయోగించి పాస్తాను తయారు చేస్తున్నామని, నాణ్యత విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోను రాజీ పడమని, తినడానికి మ్యాగీ పాస్తా అత్యంత సురక్షితమైనదని తెలిపింది. పాస్తాలో సీసం ఎక్కువగా ఉందంటూ మీడియాలో వస్తున్న వార్తలను తాము చూశామని, ఈ విషయంపై తాము కూడా దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించింది. గతంలో నెస్లేకు చెందిన మ్యాగీ నూడిల్స్ పై నిషేధం పడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News