: ఉత్తర కొరియాలో పిచ్చి తుగ్లక్ పాలన... జుట్టు పొడవు 2 సెం.మీ కంటే పెరిగితే ఫైనే!
అణ్వస్త్ర సామర్థ్యాన్ని నానాటికి పెంచుకుంటూ ప్రపంచ దేశాలను అయోమయానికి గురి చేస్తున్న ఉత్తర కొరియాలో నిజంగానే పిచ్చి తుగ్లక్ పాలన నడుస్తోంది. మగాళ్లు తమ హెయిర్ కట్ ను నీట్ గా ఉంచుకోవాలని, తలపై వెంట్రుకల పొడవు 2 సెంటీ మీటర్ల లోపే ఉండాలని ఇటీవల ఓ అధికారిక ఉత్తర్వు జారీ అయ్యింది. 2 సెంటీ మీటర్ల కంటే తక్కువ పొడవుతో పాటు హెయిర్ కట్ లో తలకు రెండు వైపులా నున్నగా షేవ్ చేసుకోవాల్సిందేనట. ఈ రెంటిలో ఏది పాటించకున్నా జరిమానాకు గురవుతారు. ఈ మేరకు ఇటీవల విడుదలైన సదరు ఉత్తర్వుల్లో రాజు కిమ్ జోంగ్ ఉన్ ను రోల్ మోడల్ గా తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వం ఆ దేశ మగరాయుళ్లను ఆదేశించింది. మహిళలకు ఇలాంటి కండీషన్లేమీ పెట్టని ఆ ఉత్తర్వు... వేషధారణలో రాణి గారిని ఆదర్శంగా తీసుకోవాలని ఫత్వా జారీ చేసింది. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘డెయిలీ మెయిల్’ ఓ ప్రత్యేక కథనాన్ని రాసింది.