: ‘ఐడియా ఆఫ్ ఇండియా’ను 19 సార్లు పలికిన మోదీ!
'రాజ్యాంగం- అంబేద్కర్' అనే అంశంపై లోక్ సభలో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరిగింది. చివరి రోజైన శుక్రవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై మాట్లాడారు. తన ప్రసంగం ముగింపులో భారత్ అంటే ఏమిటి? అనే దానిపై మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఐడియా ఆఫ్ ఇండియా’ అనే వాక్యాన్ని కనీసం 19 సార్లు ఉచ్చరించారు. ‘ఐడియా ఆఫ్ ఇండియా... సత్యమేవ జయతే ఐడియా ఆఫ్ ఇండియా... అహింసా పరమో థర్మ: ...’ అంటూ ఆయన ప్రసంగం కొనసాగింది. ‘ఐడియా ఆఫ్ ఇండియా... జననీ జన్మభూమిశ్చ స్వర్గా దపి గరీయసీ’ అనే శ్లోకం పలికే వరకు గుక్కతిప్పుకోకుండా ఆయన మాట్లాడారు. దీంతో అధికార పార్టీ సభ్యులు తమ బల్లలు చరిచి మరీ, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే, మోదీ అద్భుత ప్రసంగానికి ఆశ్చర్యపోవడం విపక్ష సభ్యుల వంతైంది.