: రాజ్యాంగంపై ఆన్ లైన్ పోటీలు పెట్టొచ్చుగా!: ప్రధాని మోదీ


రాజ్యాంగంపై ప్రజల్లో ఆసక్తి కల్పించేందుకు ఆన్ లైన్ పోటీలు ఎందుకు పెట్టకూడదంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రాజ్యాంగం అంశంపై శుక్రవారం లోక్ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, విద్యా సంస్థల్లో రాజ్యాంగంపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని, భారత ప్రజాస్వామ్య చరిత్రలో నవంబర్‌ 26 కు ఎంతో విశిష్టత ఉందన్నారు. రాజ్యాంగాన్ని ఒక దస్త్రంగా చూడకూడదని, దాని మూలాల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. రాజ్యాంగంలోని ప్రతి పేజీలో అంబేద్కర్ గొప్పతనం కన్పిస్తుందని, ఆయన రచనలు, బోధనలు అన్ని తరాలకు అనుసరణీయమని అన్నారు.

  • Loading...

More Telugu News