: గ్రామాల్లో కూడా మాఫియాను ప్రవేశపెట్టిన ఘనుడు చంద్రబాబు: శ్రీకాంత్ రెడ్డి


ఏపీలో ప్రతి చోటా అవినీతి రాజ్యమేలుతోందని వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆరేళ్ల క్రితం ట్రాక్టర్ ఇసుక రూ. వెయ్యిలోపు ఉంటే, ఇప్పుడు వేలల్లో ఉందని విమర్శించారు. ఇసుక క్వారీల్లో జరుగుతున్న దోపిడీపై మాట్లాడే ధైర్యం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రెండు పేపర్లను వాడుకుంటున్నారని... అందులో ఒకటి న్యూస్ పేపరయితే, రెండోది వైట్ పేపర్ (శ్వేతపత్రం)అని విమర్శించారు. గ్రామగ్రామాన మాఫియాను ప్రవేశ పెట్టిన ఘనత చంద్రబాబుదే అని ఆరోపించారు.

  • Loading...

More Telugu News