: టీ తాగుదాం రండి... మన్మోహన్, సోనియాలకు నరేంద్ర మోదీ ఆహ్వానం!
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన జీఎస్టీ బిల్లుకు ఆమోదమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలను కలుపుకునిపోవాలని భావిస్తున్నారు. జీఎస్టీకి ఉన్న అడ్డంకులను చర్చల ద్వారానే తప్పించాలని భావిస్తున్న ఆయన, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీలను తేనీటి విందుకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. రేస్ కోర్స్ రోడ్డులోని తన నివాసానికి నేటి సాయంత్రం 7 గంటలకు రావాలని, స్వాగతం పలికేందుకు తాను సిద్ధంగా ఉంటానని చెబుతూ, కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం పంపారు. కాగా, జీఎస్టీపై ఎవరితోనైనా చర్చించేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.