: మీడియాను కేసీఆర్ వేధిస్తున్నారు: టీడీపీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ విమర్శనాస్త్రాలు సంధించింది. టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టింది ప్రతిపక్షాలు, మీడియాపై ఆంక్షలు విధించడానికి కాదంటూ మండిపడింది. వరంగల్ ఉప ఎన్నిక తర్వాత విపక్షాలను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని టీటీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. మీడియాపై ఆంక్షలు విధించి కేసీఆర్ వేధిస్తున్నారని విమర్శించారు. గతంలో పలు అంశాలపై విపక్షాలు పోరాడిన తర్వాత వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.