: ఢిల్లీలో అతి పెద్ద చోరీ... రూ.22 కోట్లతో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ పరారీ, పట్టేసిన పోలీసులు


దేేేేశ రాజధాని డిల్లీలో నిన్న రాత్రి అతిపెద్ద చోరీ జరిగింది. ఏటీఎంలలో డబ్బు పెట్టే వ్యాన్ కు డ్రైవర్ గా పనిచేస్తున్న ప్రదీప్ అనే వ్యక్తి మరికొంత మందితో కలిసి ఈ భారీ చోరీకి పక్కా ప్లాన్ రచించాడు. రోజుల తరబడి అతడు రెక్కీ నిర్వహించాడు. నిన్న రాత్రి తన ప్రణాళికను అమలు చేశాడు. వ్యాన్ తో పాటు అందులోని రూ.22 కోట్లతో చెక్కేశాడు. కళ్లు మూసి తెరిచేలోగా వ్యాన్ తో డ్రైవర్ పరారు కావడంతో బ్యాంకు సిబ్బంది వెనువెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఏకంగా రూ.22 కోట్లతో డ్రైవర్ పరారీ ఘటన నగరంలో పెను కలకలం రేపింది. ఫిర్యాదు అందిన వెంటనే వేగంగా స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నగరాన్ని జల్లెడ పట్టారు. భారీ చోరీకి పక్కా ప్లాన్ వేసి, దానిని విజయవంతంగా అమలు చేసిన ప్రదీప్ పారిపోవడంలో మాత్రం విఫలమయ్యాడు. నగరంలోని ఓక్లా ప్రాంతంలో దాక్కుందామన్న అతడి యత్నం విఫలమైంది. ఓక్లా ప్రాంతంలో వ్యాన్ ను గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టి ప్రదీప్ ను అదుపులోకి తీసుకున్నారు. అదే ప్రాంతంలో దాచిన చోరీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇక అతగాడికి సహకరించిన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News