: పులి దాడిలో యువకుడికి గాయాలు


ఆదిలాబాద్ జిల్లా మామడ మండల కేంద్రానికి చెందిన చిన్నల్ల పోశెట్టి(25) అనే యువకుడిపై పులి దాడి చేసింది. ఈ దాడిలో గాయపడ్డ యువకుడిని నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన పోశెట్టిపై అకస్మాత్తుగా పులి దాడి చేయడంతో అతని కాలికి గాయమైంది. దీంతో అక్కడి నుంచి తప్పించుకుని ఆ యువకుడు బయటపడ్డాడు. కాగా, మామడ పరిసరాల్లో పులి సంచరిస్తున్న సమాచారాన్ని అటవీ శాఖ సిబ్బందికి గ్రామస్తులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో వారు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News