: త్వరలో యూఎస్ వెళ్లనున్న అమీర్ ఖాన్?


‘అసహనం’పై పలు విమర్శలు ఎదుర్కొన్న బాలీవుడ్ టాప్ హీర్ అమీర్ ఖాన్ యూఎస్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లైఫ్.కామ్ సమాచారం ప్రకారం...అమీర్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం దంగల్. పంజాబ్ లోని లూథియానాలో ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. లూథియానాలో తన షూటింగ్ షెడ్యూల్ ముగియగానే ఆయన యూఎస్ కు ఒక చిన్న ట్రిప్పు నిమిత్తం వెళ్లనున్నారు. అయితే, అమీర్ ఖాన్ యూఎస్ ట్రిప్పు ముందుగా ప్లాన్ చేసుకున్నదా? లేక ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆయన వెళుతున్నారా? అన్న విషయం తెలియదు’ అని ఆ కథనంలో పేర్కొంది. కాగా, అమీర్ పై వస్తున్న విమర్శలు, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు మరింత భద్రత పెంచారు.

  • Loading...

More Telugu News