: ట్రైలర్ విడుదలైన ఒక్క రోజులో కోటి మంది చూశారు
ఒక సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లోనే కోటి మందికిపైగా అభిమానులు వీక్షించడం విశేషం. హాలీవుడ్ సినిమా 'కెప్టెన్ అమెరికా సివిల్ వార్' సినిమా ట్రైలర్ ను నిన్న విడుదల చేశారు. ఎవేంజర్స్ బృందం నుంచి విడిపోయిన ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా మధ్య విభేదాలు ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమాను రూపొందించారు. ఆంటోనీ ర్యూసో, జో ర్యూసో దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016 మే 6న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.