: ముందుగా ఎవరొస్తే వారికే ‘మెట్రో’ ఔట్ లెట్స్: ఎల్‌అండ్‌టీ ఎండీ గాడ్గిల్


హైదరాబాద్ లోని నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఔట్‌లెట్‌లు ఏర్పాటు చేయాలనుకునేవారు ఆన్‌లైన్‌లో సంప్రదించాలని, ముందుగా ఎవరొస్తే వారికే ప్రాధాన్యత ఉంటుందని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ ఎండీ గాడ్గిల్ పేర్కొన్నారు. నాగోల్ మెట్రోస్టేషన్ లో ఏర్పాటు చేసిన నమూనా షాపింగ్ ఔట్ లెట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం గాడ్గిల్ మాట్లాడుతూ, ఔట్ లెట్ లకు ఎలాంటి టెండర్లు లేవన్నారు. మెట్రో స్టేషన్లలో ఔట్ లెట్ ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే 24 శాతం అమ్మకం పూర్తయినట్లు గాడ్గిల్ చెప్పారు.

  • Loading...

More Telugu News