: అమీర్ ఖాన్ ను చెంపదెబ్బ కొడితే లక్ష నజరానా!


సినీ నటుడు అమీర్ ఖాన్ పై ఆందోళనలు ఆగడం లేదు. లూధియానాలో అమీర్ ఖాన్ బస చేసిన 'రాడిసన్ బ్లూ' హోటల్ కు చేరుకున్న శివసేన కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టిన వారికి లక్ష రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. కొట్టిన ప్రతి దెబ్బకు లక్ష రూపాయలిస్తామని వారు ప్రకటించారు. ఈ ఆఫర్ ను 'దంగల్' సినిమా యూనిట్, రాడిసన్ బ్లూ హోటల్ సిబ్బంది కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. అమీర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టిన వారిని సాహసవంతులు, దేశభక్తి కలిగిన వారిగా గుర్తిస్తామని శివసేన పంజాబ్ విభాగం అధ్యక్షుడు రాజీవ్ టాండన్ ప్రకటించారు. దీంతో 'దంగల్' సినిమా షూటింగ్ సందర్భంగా కండరాలు పట్టేయడంతో వారం రోజులు విశ్రాంతి తీసుకున్న అమీర్ నిన్నే మళ్లీ ఈ సినిమా షూటింగ్ కోసం లూధియానా వెళ్లాడు.

  • Loading...

More Telugu News