: ముంబైలో 10,000 ఎస్ఎఫ్టీ డూప్లెక్స్, ధర రూ. 160 కోట్లు!


ఓ వైపు భారత నిర్మాణ రంగం ఆశించిన స్థాయిలో దూసుకెళ్లలేక చతికిలపడ్డ వేళ, ముంబైలో పాత రికార్డులన్నీ బద్దలైపోయాయి. ముంబైలోని అల్టా మౌంట్ రోడ్డులో లోధా గ్రూప్ నిర్మిస్తున్న లగ్జరీ టవర్ లో ఓ డూప్లెక్స్ ను రూ. 160 కోట్లకు విక్రయించినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ డూప్లెక్స్ ను ఓ ఫార్మా కంపెనీ అధినేత కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇండియాలో అపార్ట్ మెంట్ల అమ్మకాల్లో ఇదే అతిపెద్ద డీల్ అని సమాచారం. కాగా, నిధుల లేమితో సతమతమవుతున్న భారత రియల్ ఎస్టేట్ డెవలపర్లు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నప్పటికీ, కొత్తగా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్దగా ముందుకు రావడం లేదని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News