: స్టూడెంట్ తో టీచర్ రాసలీలలు... లాడ్జీలో పోలీసులకు అడ్డంగా బుక్కైన వైనం


అతడో ఉపాధ్యాయుడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడం అతడి బాధ్యత. అయితే తనపై ఉన్న ‘గురు’తర బాధ్యతను మరిచి కీచకుడిగా మారాడు. నయానో, భయానో విద్యార్థినులను లొంగదీసుకుంటున్న అతడు, వారితో రాసలీలల్లో తేలియాడుతున్నాడు. గుట్టుగా సాగుతున్న అతడి బండారాన్ని పోలీసులు రట్టు చేశారు. నిన్న రాత్రి లాడ్జీల తనిఖీల్లో భాగంగా ఆ దుర్మార్గుడు విద్యార్థినితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఖమ్మం నగరంలో నిన్న రాత్రి ఈ ఘటన వెలుగుచూసింది. విద్యార్థినితో కలిసి రాసలీలల్లో మునిగిన సదరు ప్రబుద్ధుడికి క్లాస్ పీకిన పోలీసులు వారిద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండల పరిధిలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు ఈ ఘనకార్యం వెలగబెట్టాడు.

  • Loading...

More Telugu News