: రండి... కలిసి పోరాడుదాం: గిరిజన యువతకు మావోల పిలుపు


రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నిషేధిత మావోయిస్టులు క్రమంగా బలం పుంజుకుంటున్నారు. ఇరు రాష్ట్రాల్లో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఘటనలను పరిశీలిస్తే మావోల ప్రాబల్యం పెరుగుతున్న వైనంపై పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులివ్వడం, ఆ తర్వాత నిలిపివేయడం తెలిసిందే. ఇదే అంశాన్ని ఆసరా చేసుకున్న మావోయిస్టులు పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్లకు తెర తీశారు. ఈ మేరకు ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మావోయిస్టు కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి రమణ మాట్లాడారు. బాక్సైట్ కు వ్యతిరేకంగా తాము సాగిస్తున్న పోరులో గిరిజన యువత పాలుపంచుకోవాలని ఆయన కోరారు. వచ్చే నెల 2 నుంచి 8 దాకా జరగనున్న మావోయిస్టు వారోత్సవాల్లో పెద్ద సంఖ్యలో యువత తమ దళాల్లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ సమస్య కూడా శాంతియుతంగా పరిష్కారం కాదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.

  • Loading...

More Telugu News