: పాక్ తో సిరీస్ కు అనుమతివ్వండి: కేంద్రానికి బీసీసీఐ లేఖ


పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నిన్న బీసీసీఐ కేంద్రానికి లేఖ రాసింది. 2008లో ముంబైపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు నిలిచిపోయాయి. అయితే ఇటీవలి కాలంలో ఇరు దేశాల జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లను పునరుద్ధరించాలన్న నిర్ణయానికి రెండు దేశాల బోర్డులు వచ్చాయి. తటస్థ వేదికపై సిరీస్ కు బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్, పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ లు దాదాపుగా నిర్ణయించారు. అయితే రెండు బోర్డులకు ఆయా దేశాల ప్రభుత్వాలు అనుమతించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న బీసీసీఐ కేంద్రానికి లేఖ రాసింది. బీసీసీఐకి కేంద్రం అనుమతిస్తే, వచ్చే నెలలో శ్రీలంక వేదికగా భారత్-పాక్ సిరీస్ జరగనుంది.

  • Loading...

More Telugu News