: కోహ్లి క్యాచ్ అవుట్... జడేజా బౌల్డ్... మరి, రాహుల్ గాంధీ... స్టంప్డ్!


బెంగళూరులోని ప్రతిష్టాత్మక మౌంట్ కార్మెల్ కళాశాల విద్యార్థినులతో ఇంటరాక్ట్ అయిన రాహుల్ కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెటిజన్లు రాహుల్ పై విమర్శల వర్షం కురిపించారు. ఆ విమర్శల ట్వీట్లు ఏమిటంటే... ‘ఈ రోజు నాగపూర్ టెస్ట్ మ్యాచ్ లో కోహ్లి క్యాచ్ అవుట్, జడేజా బౌల్డ్.. మరి, రాహుల్... స్టంప్డ్’ అని ఒకరు ట్వీట్ చేయగా, ‘రాహుల్ జీ !... ఇంట్లో కూర్చుని చోటా భీమ్ చూడండి’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. స్వచ్ఛ భారత్ పథకం విజయవంతమైందా? అన్న రాహుల్ ప్రశ్నకు ‘ఎస్’ అంటూ విద్యార్థినులను సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్ బిక్కమొహం వేసి, బీజేపీ సర్కార్ పై వేరే ఆరోపణలకు దిగారు.

  • Loading...

More Telugu News