: ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: స్నాప్ డీల్
ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ తమ సంస్థపై వస్తున్న ఒత్తిడికి లొంగి ఓ ప్రకటన విడుదల చేసింది. "ఆమిర్ వ్యక్తిగత పరిధిలో చేసిన వ్యాఖ్యలతో స్నాప్ డీల్ కు ఎలాంటి సంబంధం లేదు. స్నాప్ డీల్ భారత్ కు గర్వకారణమైన సంస్థ. యువ భారతీయులు అత్యంత ప్రేమతో నిర్మించిన ఈ సంస్ధ సమ్మిళిత డిజిటల్ ఇండియా నిర్మాణంలో దృష్టి పెట్టింది. ప్రతిరోజూ మేమే భారత్ లోని వేలాది చిన్న వ్యాపారులు, లక్షలాది వినియోగదారులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. భారత్ లో 10 లక్షల మంది విజయవంతమైన ఆన్ లైన్ వ్యాపారవేత్తలను తయారు చేయాలని పెట్టుకున్న లక్ష్యం దిశగా మేం ముందుకు సాగుతున్నాం" అని పేర్కొంది.