: నితీశ్ కుమార్ నిజాయతీ పరుడనే ఆయనకు మద్దతిచ్చాం: రాహుల్ గాంధీ
'బతుకు, బతికించు' అనేది కాంగ్రెస్ సిద్ధాంతమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బెంగళూరులో రాహుల్ మాట్లాడుతూ, బీహార్ లో నితీశ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని సమర్ధిస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఆయన నిజాయతీపరుడన్న కారణంతోనే తాము ఆయనకు మద్దతిచ్చామని చెప్పారు. అలాగే బీహార్ మంత్రి వర్గంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఎలాంటి పదవులు చేపట్టడం లేదని అంతా గుర్తించాలని ఆయన చెప్పారు. బీహార్ లో ఆయన చేసిన అవినీతికి, ప్రభుత్వంలో భాగమైన ఆయన కుమారులకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో మహారాష్ట్రలో బీజేపీ నేతలు చేసిన అవినీతిని గుర్తించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి సహకరించదని ఆయన తేల్చిచెప్పారు.