: రేపు నారావారిపల్లెకు చంద్రబాబు...మనవడు దేవాన్ష్ తలనీలాలకు హాజరు


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రేపు తన సొంతూరు నారావారిపల్లెకు వెళుతున్నారు. తన మనవడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ తలనీలాల కార్యక్రమాన్ని తమ సొంతూరు నారావారిపల్లెలో నిర్వహించేందుకు చంద్రబాబు కుటుంబం నిర్ణయించింది. ఇటీవలే తిరుమలలో దేవాన్ష్ అన్నప్రాసన కార్యక్రమం ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ చిన్నారి తలనీలాల కార్యక్రమానికి రేపు ముహూర్తం ఖరారైంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకే చంద్రబాబు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెకు వెళుతున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు ఆయన బావమరిది, కోడలు బ్రాహ్మణి తండ్రి బాలకృష్ణ కుటుంబం కూడా హాజరుకానుంది.

  • Loading...

More Telugu News