: వరంగల్ ఓటమికి సమష్టి బాధ్యత వహిస్తాం: జానారెడ్డి
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడారు. పార్టీ ఓటమికి సమష్టి బాధ్యత వహిస్తామని తెలిపారు. వరంగల్ ప్రజలు కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మలేదని అన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకు వెళతామని చెప్పారు. కేడర్ ఆత్మస్థైర్యం కోల్పోకూడదని అన్నారు. ఈ మేరకు హైదరాబాదు గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జానా మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పొత్తులైనా ఉండొచ్చని పేర్కొన్నారు. ఇక మూడేళ్లలో ప్రాజెక్టుల ద్వారా రెండో పంటకు నీళ్లిస్తే సీఎం కేసీఆర్ తాను ప్రచార సారథిగా పని చేస్తానన్న సవాల్ కు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.