: ఏపీకి రూ.700 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.700 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తం నిన్న(మంగళవారం) రాష్ట్ర ఖజానాకు చేరింది. వరద సాయం కింద తక్షణమే రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలంటూ నాలుగు రోజుల కిందట సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. కానీ తరువాత తమిళనాడు సీఎం జయలలిత కూడా వరద సాయం కోసం లేఖ రాశారు. వెంటనే స్పందించి వారికి రూ.940 కోట్లు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ గురించి స్పందించకుండా తమిళనాడుకు తక్షణం ప్రతిస్పందించిందన్న విమర్శలు రావడంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చకచకా కేంద్ర ప్రణాళిక పథకాల కింద ఏపీకి రూ.700 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News