: ఓపెనర్లు ఔట్... క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ
ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా నేటి ఉదయం నాగ్ పూర్ లో మొదలైన మూడో టెస్టులో భారత బ్యాట్స్ మెన్ తడబడుతున్నారు. సఫారీల పదునైన బౌలింగ్ తో ఇబ్బందులు పడ్డ ఓపెనర్ మురళీ విజయ్(40) తొలి రెండు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి సింగిల్ పరుగు మాత్రమే రాబట్టాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (12)తో కలసి ఊపుతో ఫామ్ లోకి వచ్చిన ఈ చెన్నై ప్లేయర్ హాఫ్ సెంచరీ దరిదాపుల్లోకి వెళ్లాడు. అయితే తొలుత శిఖర్ ధావన్ వెనుదిరగగా, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోకుండానే మురళీ విజయ్ కూడా చేతులెత్తేశాడు. దీంతో 69 పరుగులకే టీమిండియా ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ (2), ఫస్ట్ డౌన్ బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా(14)తో జత కలిశాడు. 23 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.