: ఫలించిన హరీశ్ మంత్రాంగం... లోయర్ పెన్ గంగకు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్


తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మంత్రాంగం ఫలించింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో నిన్న జరిపిన ఆయన చర్చలు ఫలించాయి. వెరసి సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న లోయర్ పెన్ గంగ ప్రాజెక్టుకు ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ప్రాజెక్టును నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. నిన్న మహారాష్ట్ర రాజధాని ముంబై వెళ్లిన హరీశ్ రావు, అక్కడి సాగునీటి శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు వల్ల ఉన్న ప్రయోజనాలు, తెలంగాణకు ఒనగూరే లాభాలను చర్చించారు. ఈ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రకు నష్టం జరుగుతుందన్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని హరీశ్ రావు కూలంకషంగా వివరించారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి ఒప్పందం చేసుకోనున్నట్లు హరీశ్ రావు ప్రకటించారు.

  • Loading...

More Telugu News