: కల్తీ ముఠా సూత్రధారి ఫణికుమార్ అరెస్ట్


విజయవాడలో కల్తీ సూత్రధారి ఫణికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటుకపొడి, చెక్కపౌడర్, కెమికల్స్ తో కల్తీ వంట దినుసులను తయారుచేయడమే కాకుండా... కల్తీ పసుపు, కారం, నెయ్యిలను తయారు చేసి, నకిలీ బ్రాండ్స్ తో అమ్మకం సాగిస్తున్న ముఠా సూత్రధారి ఫణికుమార్ ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగ్ నగర్ లో అత్యాధునిక యంత్రాలతో నందిని బ్రాండ్ పేరిట కోట్ల రూపాయల విలువైన కల్తీ సరకును మార్కెట్లో విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ఫణికుమార్ ను 'ఇంత పెద్ద ఎత్తున కల్తీ చేయడం ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడం కాదా?' అని ప్రశ్నించింది. దీనికి ఫణికుమార్ సమాధానమిస్తూ, 'తింటే ఏం జరుగుతుంద'ని ఎదురు ప్రశ్నించాడు. తాను కల్తీ చేయడం లేదని, అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఈలోగా ప్యాకెట్లు తయారు చేసుకుంటున్నామని, అది తప్పు కాదని స్పష్టంగా చెప్పడంతో మీడియా ప్రతినిధులు షాక్ తిన్నారు.

  • Loading...

More Telugu News