: డే నైట్ టెస్టుల ప్రయోగం ఓకే...పింక్ బంతే అనుమానం: కోహ్లీ


డే అండ్ నైట్ టెస్టు ప్రయోగం అద్భుతమైన ప్రయోగమని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. డే అండ్ నైట్ టెస్టులకు ఆదరణ లభిస్తే సంప్రదాయ క్రికెట్ కు మంచి రోజులు వచ్చినట్టేనని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు తీసుకున్న నిర్ణయం అద్భుతమైనదని కోహ్లీ వెల్లడించాడు. అయితే ప్రయోగాత్మకంగా పింక్ బంతి వినియోగంపై ఆసక్తి వ్యక్తం చేశాడు. ఫలితాలపై తనకు అందిన సమాచారం మేరకు పింక్ బంతి సరికాదేమోనని అభిప్రాయపడ్డాడు. పూర్తిగా పగలు, లేదా రాత్రి అయితే కనుక పింక్ బాల్ తో ఇబ్బందులు ఉండవని పేర్కొన్న కోహ్లీ, డే నైట్ మ్యాచ్ లు నిర్వహించేటప్పుడు కాంతి బలహీనమవుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయేమోనని సందేహం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News