: అసహనం అంటే ఇదేనా?: రాంగోపాల్ వర్మ


మత అసహనంపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు చేయడంతో రాంగోపాల్ వర్మకు కూడా కోపం వచ్చినట్టుంది. అందుకే అసలు మత అసహనం అంటే ఏమిటని ప్రశ్నించాడు. హిందూ దేశమైన భారత దేశంలో ముగ్గురు సూపర్ స్టార్లు ముుస్లిం మతానికి చెందిన వారని, మత సహనంపై ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని ఆయన ప్రశ్నించాడు. దేశంలో ఎవరైతే సెలబ్రిటీలుగా చలామణి అవుతున్నారో వారే ఈ దేశాన్ని విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డాడు. ఒకట్రెండు ఘటనలను చూపించి దేశంలో మత అసహనం పెరిగిపోతోందని పేర్కొనడం సరికాదని వర్మ అభిప్రాయపడ్డాడు. కాగా, అమీర్ వ్యాఖ్యలపై వివిధ హిందూ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News