: రైల్వే ప్రయాణికుల రక్షణకు మూడంకెల హెల్ప్ లైన్ నంబర్
భారతీయ రైల్వే ప్రయాణికుల రక్షణ కోసం 182 హెల్ప్ లైన్ నంబర్ ను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ హెల్ప్ లైన్ నంబర్ 24 గంటల పాటు ప్రయాణికులకు సేవలు అందించనుంది. దొంగతనాలు, పిక్ పాకెటింగ్, అనుమానిత వస్తువులను వదిలివెళ్లడం, మహిళా ప్రయాణికులను వేధించడం, మహిళా బోగీలు, అదేవిధంగా శారీరక వైకల్యం గలవారికి కేటాయించిన బోగీలలో వేరే వ్యక్తులు ప్రయాణించడం, ఇతర భద్రతాపరమైన సమస్యలు తలెత్తితే ప్రయాణికులు 182 నంబర్ కు ఫోన్ చేయచ్చని రైల్వే అధికారులు తెలిపారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.