: వరంగల్ ఉప ఎన్నిక ఫలితం నిరాశ పరిచింది: కిషన్ రెడ్డి
వరంగల్ ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి డిపాజిట్ కోల్పోయి మూడవ స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మీడియా వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలో ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోలేకపోయామని అన్నారు. ఈ ఫలితాలు నిరాశ కలిగించాయని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పొదుపు సంఘాల ద్వారా ఓటర్లకు డబ్బులు వెదజల్లారని ఆరోపించారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచే టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుందని చెప్పారు. మజ్లిస్ అభ్యర్థిని మేయర్ చేయాలని టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.