: 'క్యాండీ క్రష్' తరహాలో కొత్త గేమ్ 'బ్లసమ్ బ్లాస్ట్ సాగా'
అత్యధిక శాతం యూజర్లను ఆకట్టుకున్న క్యాండీ క్రష్ సాగా గేమ్ తరహాలో కింగ్ సంస్థ నుంచి మరో సరికొత్త గేమ్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ గేమ్ పేరు 'బ్లాసమ్ బ్లాస్ట్ సాగా' (BLOSSOM BLAST SAGA). ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం ఈ గేమ్ ను రూపొందించారు. దానికి సంబంధించిన యాప్ ను యూజర్లు తమ తమ యాప్ స్టోర్ ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ గేమ్ ను 10 లక్షల మందికిపైగా యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆండ్రాయిడ్ 4.0, ఆపైన వెర్షన్, ఐఓఎస్ 5.1 ఆపైన వెర్షన్ కలిగిన యూజర్లకు ఈ గేమ్ లభిస్తోంది.