: ఐఎస్ఐఎస్, అల్ ఖైదా, బోకోహారమ్... ఎవరైనా, ఎప్పుడైనా: అమెరికా హెచ్చరిక
పలు ఉగ్రవాద సంస్థలు ఏ దేశంపైనైనా విరుచుకుపడేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నాయని అమెరికా ప్రభుత్వం తన అధికారిక వెబ్ సైట్ లో హెచ్చరించింది. ఇతర దేశాలకు వెళ్లే అమెరికన్లు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా, బోకోహారమ్ తదితర ఉగ్రవాద సంస్థలు ఎప్పుడైనా, ఎక్కడైనా దాడులకు తెగబడవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని, ఆయుధాలతో మాత్రమే కాకుండా, భౌతిక దాడులకూ వారు పాల్పడవచ్చని తెలిపింది. జన సమూహాల మధ్య ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ 'ట్రావెల్ అలర్ట్' ప్రకటించింది. కాగా, ఇటీవల తాము వైట్ హౌస్ తో పాటు న్యూయార్క్ నూ లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతామని ఐఎస్ఐఎస్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.