: ‘ఓరుగల్లు’లో ‘నోటా’కు కూడా ఓట్లు!... మూడు రౌండ్లలో 1022 ఓట్లు


వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో ఒక్కరూ సరైన నేత లేరంటూ కొందరు ఓటర్లు తేల్చిచెప్పారు. మూడు రౌండ్లు పూర్తయ్యేసరికే ఈ తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారి సంఖ్య 1022గా తేలింది. ఈ నెల 21న జరిగిన పోలింగ్ లో ఎన్నికల సంఘం ‘నోటా‘ బటన్ ను అందుబాటులోకి తెచ్చింది. బరిలోని ఏ ఒక్క అభ్యర్థి నచ్చని ఓటర్లు ‘నోటా’ గుర్తుకు ఓటేస్తారు. నేటి ఉదయం వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఇప్పటిదాకా మూడు రౌండ్లు ముగిశాయి. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ దాదాపు 65 వేల ఓట్ల ఆధిక్యంతో దూసుకెళుతున్నారు. అయితే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఒక్కరు కూడా సమర్థులు కారని 1022 మంది ఓటర్లు ‘నోటా’కు ఓటేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

  • Loading...

More Telugu News